ఐపీఎల్ సీజన్ వస్తుందంటే క్రికెట్ అభిమానులలో ఎక్కడ లేని ఆనందం పెల్లుబికుతుంది. గత ఏడాది సీజన్‌ని గ్రాండ్‌గా నిర్వహించిన నిర్వాహకులు ఈ సీజన్ కోసం అంతకి మించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్గ్రాలు తాము ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించలేమని తేల్చి చెప్పగా, మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విదేశీ క్రికెటర్స్ లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా జరుగుతాయా అనే సందేహం సగటు అభిమానులలో కలుగుతుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో అధికారికంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఐపీఎల్‌పై కరోనా పడగ.. ఆందోళనలో క్రికెట్ ఫ్యాన్స్