దేశ ప్రజలకు రాష్ట్రపతి మహావీర్‌ జయంతి శుభాకాంక్షలు


దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహావీర్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ..  మహావీరుని పూజించే జైనులకు ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం మహావీరుని బోధనలు గుర్తు చేసుకోవాలి. అహింసా, సత్యం, అస్తియం(దొంగతనం చేయకుండుట), అపరిగ్రహం(అనుబంధం లేని) ప్రమాణాలు పాటించాలని బోధించాడు. కోవిడ్‌ వైరస్‌ కారణంగా ఈ రోజు మనం అనుబందం లేని దూరం తప్పని సరిగా పాటించి మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మహావీరుని జయంతి జైనులకు అతి పవీత్రమైన పండుగ, దేశమంతా లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా అన్ని మందిరాలు, ప్రార్థనా స్థలాలు మూసి ఉన్నాయి. ఎవరి ఇంటిలో వారే సామాజిక దూరం పాటించి దేవుడిని పూజించుకోవాలని విజ్ఞఫ్తి చేశారు.